నార్త్ బెల్ట్ లో “కార్తికేయ 2” సెన్సేషన్..రికార్డు లెవెల్లో షోస్ తో.!

Published on Aug 17, 2022 12:39 pm IST

యంగ్ హీరో నిఖిల్ మరియు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లు నటించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “కార్తికేయ 2”. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు సహా హిందీలో కూడా అదరగొడుతూ షాకింగ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ఇక హిందీ విషయానికి వస్తే మాత్రం అక్కడ మినీ సెన్సేషన్ ని ఈ చిత్రం సృష్టిస్తుంది అని చెప్పాలి.

మొదటి రోజు చాలా తక్కువ స్క్రీన్స్ లో విదుల్ అయ్యిన ఈ చిత్రం ఇక రెండు మూడు రోజుల్లో 300 శాతానికి పైగా భారీ మార్జిన్ తో స్క్రీన్స్ లో ప్రదర్శితం అవుతుంది. మరి మొదటి రోజు కేవలం 53 షో లతో స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం ఐదో రోజు చేరుకునేసరికి ఏకంగా 1500కి పై చిలుకు షోస్ కి చేరుకుంది.

మరి ఇదే అనుకుంటే రేపు శ్రీ కృష్ణాష్టమికి గాను ఒక్క హిందీ వెర్షన్ లోనే ఈ చిత్రం ఏకంగా 2500 నుంచి 3000 షోలు ప్లాన్ చేస్తున్నారని క్రేజీ టాక్ బయటకి వచ్చింది. దీనితో అయితే ఇక నార్త్ బెల్ట్ లో “కార్తికేయ 2” సెన్సేషన్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించగా కాల భైరవ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :