‘కార్తికేయ 2’ కి కొత్త విడుదల తేదీని ఖరారు!

Published on Jul 10, 2022 4:15 pm IST


యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘చందు మొండేటి’ డైరెక్షన్ లో ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌ ‘కార్తికేయ 2’. కాగా తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తికేయ 2 ఆగస్టు 5, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో, అండ్ పోస్టర్స్ బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే హిస్టారికల్ కి సంబంధించిన ఓ కాన్సెప్ట్ హైలెట్ అవునున్నాయట. పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :