4 రోజుల్లో “కార్తికేయ 2” సాలిడ్ వసూళ్లు ఎంతంటే..!

4 రోజుల్లో “కార్తికేయ 2” సాలిడ్ వసూళ్లు ఎంతంటే..!

Published on Aug 18, 2022 8:04 AM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ చిత్రం “కార్తికేయ 2”. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ అయ్యిన చోట్లా కూడా సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తూ మళ్ళీ నిఖిల్ కెరీర్ లో అప్పుడు కార్తికేయ చేసిన మ్యాజిక్ ని రిపీట్ చేస్తుంది.

మరి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వసూలు అనేది అధికారిక పోస్టర్ తో మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రం మొత్తం ఈ నాలుగు రోజుల్లో 35.1 కోటి గ్రాస్ ని వసూలు చేసిందట. మరి ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా హిందీలో కూడా ఈ సినిమా వసూళ్లు పెరుగుతుండడం ఆసక్తిగా మారుతుంది. మొత్తానికి అయితే మాత్రం ఈ చిత్ర యూనిట్ పడ్డ కష్టానికి ఖచ్చితమైన బహుమానం అందుకున్నారని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు