రిలీజ్ కి రెడీ అయిన హీరో కార్తికేయ విలేజ్ డ్రామెడీ ‘బెదురులంక 2012’

Published on Jan 29, 2023 1:41 am IST


యువ నటుడు కార్తికేయ గుమ్మకొండ హీరోగా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా తెరకెక్కనున్న లేటెస్ట్ డ్రామెడి సినిమా ‘బెదురులంక 2012’. యువ దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రొడక్షన్ నంబర్ 3 గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ సినిమాని నిర్మించారు. కాగా సి. యువరాజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో రూపొందిన ఈ సినిమా ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాని మార్చి లో ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు.

కొద్దిరోజుల క్రితం వరల్డ్ అఫ్ బెదురులంక పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై అందరిలో భారీ అంచనాలని ఏర్పరిచింది. ఇక అతి త్వరలో మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయనున్నారు మేకర్స్. ఇంకా ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి యాక్షన్ ని అంజి కంపోజ్ చేస్తుండగా పి.ఆర్.ఓగా పులగం చిన్నారాయణ, ఎడిటర్ గా విప్లవ్ న్యాసదం, సినిమాటోగ్రఫర్ గా: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్ గా బృంద, మోయిన్ తో పాటు సంగీత దర్శకుడిగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :