“వలిమై”, “భీమ్లా నాయక్” లపై కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Feb 23, 2022 12:44 pm IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర బిగెస్ట్ రిలీజ్ లు ఏమన్నా ఉన్నాయి అంటే అవి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన “వలిమై” అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” అని చెప్పాలి. అయితే ఈ ఇద్దరు హీరోల బాక్సాఫీస్ స్టామినా ఏంటో రెండు ఇండస్ట్రీల కోసం కాస్త తెలిసిన వారికి కూడా బాగా తెలుసు.భారీ వసూళ్లతో ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయి.

మరి అలాంటి ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో వస్తుండడంతో అభిమానుల్లో మరింత ఎగ్జైట్మెంట్ కూడా పెరిగింది. పైగా ఇద్దరి హీరోలకి కూడా మ్యూచువల్ అభిమానులూ ఎక్కువే.. మరి ఈ రెండు సినిమాల రిలీజ్ పై వలిమై లో నటించిన మన టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ రెండు సినిమాలు మరియు ఇద్దరి హీరోలపై చేసిన కామెంట్స్ మంచి ఆసక్తికరంగా మారాయి.

ఇద్దరి హీరోల అభిమానిగా చెప్తున్నాను ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అవుతాయని ఈ ఇద్దరి సినిమాలు కూడా చాలా రోజులు తర్వాత వచ్చి బాక్సాఫీస్ తుప్పు వదిలిస్తాయని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. మరి ఈ రెండు భారీ సినిమాలు ఎలాంటి వసూళ్లతో సెన్సేషన్ ని నమోదు చేస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :