టీజర్ టాక్..ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపిస్తున్న ‘రాజా విక్రమార్క’!

Published on Sep 4, 2021 12:00 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వస్తున్న మీడియం చిత్రాల్లో డాషింగ్ హీరో కార్తికేయ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాజా విక్రమార్క” కూడా ఒకటి. మొన్నామధ్య ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి బజ్ అందుకున్న కార్తికేయ ఇప్పుడు ఈ చిత్రం టీజర్ తో ముందుకొచ్చాడు. అయితే ఈ టీజర్ చూస్తే మట్టుకు తన కెరీర్ లో ఇది మరో ఇంట్రెస్టింగ్ రోల్ లా కనిపిస్తుంది.

ఇప్పటివరకు హీరోగా విలన్ గా కూడా చేసి మెప్పించిన కార్తికేయ ఈ చిత్రంలో ఓ అండర్ కవర్ ఏజెంట్ గా కనిపించడం పైగా ఇందులో తన చుట్టూతా జరిగే ఆపరేషన్స్ కూడా ఆసక్తికరంగా ఉండడం ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. అలాగే ఇందులో మంచి యాక్షన్ సీక్వెన్స్ లు కూడా కనిపిస్తున్నాయి.

ఓవరాల్ గా మాత్రం కొత్త ప్రయోగంతో వస్తున్న కార్తికేయ అన్నీ సెట్టయితే మంచి విజయం అందుకోవచ్చు. లాస్ట్ గా తాను చేసిన “చావు కబురు చల్లగా” ఊహించిన స్థాయి విజయం అందుకోలేదు కానీ ఇది ప్రామిసింగ్ గా ఉంది. మరి ఈ చిత్రానికి శ్రీ సారిపల్లి దర్శకత్వం వహించగా తన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు. అలాగే 88 రామా రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :