హిందీ లో పెరిగిన “కార్తికేయ2” కలెక్షన్స్!

హిందీ లో పెరిగిన “కార్తికేయ2” కలెక్షన్స్!

Published on Aug 17, 2022 9:00 PM IST

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా ఫలితంతో అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ చిత్రం హిందీలో కూడా విడుదలైంది మరియు దాని గురించి చాలా మందికి తెలియదు. కానీ మౌత్ టాక్ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటంతో కలెక్షన్లు పెరగడం మొదలైంది.

సోమవారం నాడు 1.10 కోట్ల రూపాయల వసూలు చేసిన ఈ చిత్రం మంగళవారం నాడు 1.28 కోట్ల రూపాయను వసూలు చేసింది. ఉత్తర భారతదేశం లోని అనేక ప్రాంతాలలో నేటి ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. మరోసారి లాంగ్ వీకెండ్ దగ్గర పడుతుండటంతో కలెక్షన్లు మరోసారి భారీగా పెరగడం ఖాయం అని తెలుస్తోంది. కార్తికేయ 2 చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు