కార్తి ‘ఖాకి’ విడుదల తేది ఖరారు !
Published on Oct 21, 2017 10:55 am IST

తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ నటుల్లో కార్తి ఒకడు, ప్రస్తుతం ఈ హీరో పోలీస్ గా నటిస్తున్న సినిమా ‘ఖాకి’ . రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది. ఇక ఈ సినిమా మరోసారి పోలీస్ సత్తాని తెలియచేస్తుందని చెప్పొచ్చు. తమిళ్ డైరెక్టర్ వినోద్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కార్తి లుక్ కొత్తగా కనిపిస్తున్నాడు.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి జరుపుకుంటున్న ఈ సినిమా ను నవంబర్ 17 న విడుదల చేస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కార్తి నటించిన ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించారు. పోలిస్ వ్యవస్థ పట్ల గౌరవం పెరిగేల ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు వినోద్.

 
Like us on Facebook