పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటున్న కార్తి ‘ఖాకి’ !
Published on Nov 17, 2017 12:00 pm IST

హీరో కార్తి నటించిన తాజా చిత్రం ‘తీరన్ అదిగారం ఓండ్రు’ సినిమా ఈరోజే తెలుగులో కూడా ‘ఖాకి’ పేరుతో విడుదలైంది. తమినాట నిన్నటి నుండే ప్రదర్శిస్తున్న ప్రీమియర్ల ద్వారా ఈ సినిమాకు హిట్ టాక్ మొదలవ్వగా ఈరోజు ఉదయం నుండి వేస్తున్న తెలుగు షోల నుండి కూడా పాజిటివ్ స్పందన వస్తోంది. దర్శకుడు వినోత్ కథను చెప్పిన తీరు, హీరో కార్తి నటన, పోలీస్ బ్యాక్ డ్రాప్లో నడిచే ఇన్వెస్టిగేషన్ ఈ సినిమాకు ప్రధాన బాలాకుగా నిలిచాయి.

ఈ చిత్రంతో కార్తి మరోసారి తెలుగులో మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఇందులో కార్తికి జంటగా రకుల్ ఫ్రీత్ నటించగా ఘిబ్రన్ సంగీతం అందించారు. ఇకపోతే చిత్రానికి రేపు శని, ఆదివారాల్లో కూడా ఈ పాజిటివ్ టాక్ కొనసాగితే రాబోయే వీక్ డేస్ లో సైతం సినిమా మంచి రన్ ను అందుకునే అందుకునే అవకాశముంది.

 
Like us on Facebook