ఆసక్తిని రేకెత్తిస్తున్న కార్తీ ‘ఖాకీ’ !

తమిళ హీరో కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన ‘ఆవార, ఆ పేరు శివ, ఊపిరి’ వంటి సినిమాలు హిట్లవడంతో ఆయన ఈ మధ్య చేసిన సినిమాలన్నీ తమిళంతో పాటు తెలుగులో కూడా ఏకకాలంలోనే రిలీజవుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో ఆయన చేసిన ‘తీరన్ అదిగారం ఓండ్రు’ కూడా అలాగే ‘ఖాకీ’ పేరుతో తెలుగులోకి రానుంది. కొద్దిసేపటి క్రితమే చిత్ర ట్రైలర్ కూడా విడుదలైంది.

1995, 2005 మధ్య కాలంలో జరిగిన వాస్తవ హత్యల నైపథ్యంలో రూపొందిన ఈ సినిమను వినోత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో కార్తీ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం సీరియస్ అంశం చుట్టూ తిరుగుతూ మంచి యాక్షన్, థ్రిల్స్ తో నిండి ఉంటుందని అర్థమవుతోంది. ఈ నవంబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి :