షూటింగ్ పూర్తి చేసుకున్న కార్తీ కొత్త చిత్రం !
Published on Jul 16, 2017 4:47 pm IST


తమిళ హీరో కార్తీ చేస్తున్న తాజా చిత్రం ‘తీరన్ అదిగారమ్ ఓండ్రు’ తెలుగులో ‘ఖాకి’ పేరుతో అనువాదంకానున్న సంగతి తెలిసిందే. హెచ్.వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిన్నటితో మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుంది. పాటలు, యాక్షన్ సీక్వెన్సులు ఏవీ బ్యాలన్స్ లేకుండా కంప్లీట్ చేశారట టీమ్. ఈ సినిమాలో కార్తీ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ చేస్తున్న ఈ మొదటి చిత్రంలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. 2005లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందదిన ఈ సినిమాకు ఘిబ్రాన్ సంగీతం అందించగా చిత్రాన్ని ఆగష్టు లేదా సెప్టెంబర్లో రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook