కార్తీ “సర్దార్” ఆహా కట్ ట్రైలర్ రిలీజ్!

కార్తీ “సర్దార్” ఆహా కట్ ట్రైలర్ రిలీజ్!

Published on Nov 16, 2022 2:16 AM IST


కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సర్దార్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియో లో నవంబర్ 18, 2022 నుండి ప్రసారం కానుంది.

అయితే తాజాగా ఈ చిత్రం కు సంబందించిన లేటెస్ట్ కట్ ట్రైలర్ ను ఆహా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సర్దార్ చూడాలి అంటే ఈ ప్రోమో చూడాలి అంటూ ఆహా వీడియో చెప్పుకొచ్చింది. రాశి ఖన్నా, రజిష విజయన్, లైలా లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు