అందరినీ షాక్ కి గురి చేస్తున్న కాశ్మీర్ ఫైల్స్ మూవీ కలెక్షన్స్

Published on Mar 16, 2022 1:30 pm IST

కాశ్మీర్ ఫైల్స్ ఒక రకమైన సంచలనం సృష్టించిన సినిమా. విడుదలైన మొదటి రోజు నుండి మౌత్ టాక్ బాగానే ఉంది మరియు కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. కాశ్మీరీ పండిట్‌ల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆది, సోమవారాలతో పోలిస్తే నిన్న 18 కోట్లు వసూలు చేసింది. దీన్నిబట్టి చూస్తే సినిమాని అంతటా ఎంత మంది చూస్తున్నారు అనేది తెలుస్తోంది.

ఈ సినిమా కోసం రోజూ చాలా స్క్రీన్లు యాడ్ అవుతున్నాయి. మరియు అతి త్వరలో ఈ చిత్రం 100 కోట్ల మార్క్‌ను టచ్ చేయనుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు 60 కోట్లు వసూలు చేసింది.

సంబంధిత సమాచారం :