200 కోట్ల క్లబ్ లోకి “కాశ్మీర్ ఫైల్స్”

Published on Mar 24, 2022 1:45 pm IST


వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం లో కాశ్మీర్ పండిట్ ల ఆధారం గా తెరకెక్కిన చిత్రం కాశ్మీర్ ఫైల్స్. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ అందరికీ ఆశ్చర్యం ను కలిగిస్తోంది. 13 వ రోజు మరో 10 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను సాధించి, మొత్తం 200 కోట్ల కి పైగా వసూళ్లను రాబట్టింది. గత కొద్ది రోజుల వసూళ్లతో పోల్చితే కాస్త దూకుడు తగ్గింది అని చెప్పాలి.

మార్చ్ 25 వ తేదీన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్ర భారీగా దేశ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. బాలీవుడ్ లో దాదాపు 3,500 కి పైగా థియేటర్ల లో విడుదల అయ్యే అవకాశం ఉంది. కాశ్మీర్ ఫైల్స్ వసూళ్లను ను రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అడ్డుకుంటుందా లేదా అనేది త్వరలో తెలియనుంది. 200 కోట్ల రూపాయల క్లబ్ లోకి కాశ్మీర్ ఫైల్స్ అడుగు పెట్టడం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :