‘కాటమరాయుడు’ ఏపీ, తెలంగాణా వసూళ్ల వివరాలు !


పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం భారీ అంచనాల నడుమ పెద్ద సంఖ్యలో విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. అలాగే రెండవ రోజు మొదటి షో సమయంలో కాస్త తడబడిన ఈ చిత్రం ఆ తర్వాత పుంజుకుని మంచి వసూళ్లను రాబట్టింది. ఇక మూడవ రోజు ఆదివారం కావడంతో ఈ కలెక్షన్లు మరింత ఊపందుకున్నాయి. అలాగే నిన్న సోమవారం నాల్గవరోజు కూడా వసూళ్లు ఆశాజనకంగానే సాగాయి.

మొట్ట నిన్నటితో కలిపి ఏరియాల వారీగా 4రోజుల కలెక్షన్స్ వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. ముందుగా వైజాగ్ లో నాలుగు రోజులకు కలిపి రూ. 4.87 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఈస్ట్ గోదావరిలో రూ. 4. 61 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3. 55 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 2. 74 కోట్లు, గుంటూరులో రూ. 3. 95 కోట్లు, నెల్లూరులో రూ. 1. 69 కోట్లు, సీడెడ్ లో రూ. 5. 55 కోట్లు, ముఖ్యమైన నైజాం ఏరియాలో రూ. 10. 71 కోట్లు వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.37. 67 కోట్ల షేర్ ను కొల్లగొట్టింది.