సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కాటమరాయుడు’ !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. ఈ మధ్యే విదేశాల్లో పాఠాలు చిత్రీకరం పూర్తి చేసుకున్న ఈ చిత్రం కాస్త పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తప్ప అన్ని పనులు పూర్తి చేసుకోవడంతో ఈ సెన్సార్ కు కూడా వెళ్ళింది. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు చిత్రానికి ‘U’ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే ప్రముఖ నిర్మాత, పవన్ సన్నిహితుడు బండ్ల గణేష్ సెన్సార్ రిపోర్ట్ చాలా గొప్పగా వచ్చిందని, సినిమా బ్లాక్ బస్టర్ అని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ అన్నీ మంచి ఆదరణ దక్కించుకోవడం, ఇప్పుడొచ్చిన సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా ఉండటంతో చిత్రంపై ఉన్న అంచనాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. సినిమా మొత్తం రన్ టైమ్ 144 నిముషాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించగా కిశోర్ కుమార్ పార్థసాని డైరెక్ట్ చేశారు. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.