ఉభయ గోదావరి జిల్లాల్లో దుమ్ము దులుపుతున్న కాటమరాయుడు !

25th, March 2017 - 02:12:32 PM


గోదావరి జిల్లాల్లో సినిమా అభిమానులు విపరీతంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమా విడుదలైందంటే ఆ హంగామా మామూలు గా ఉండదు. మరో మారు ఆవిషయం రుజువైంది. అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసిన పవన్ తాజాచిత్రం కాటమరాయుడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఉభయ గోదావరి జిల్లాల్లో తొలి రోజు ఈ చిత్రం కళ్లు చెదిరే కలెక్షన్ లను సాధించింది.

ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈచిత్రం రూ.3.5 కోట్లు మరియు రూ 2. 6 కోట్ల షేర్ ని సాధించడం విశేషం. ఈ ఏరియాల్లో పవన్ క్రేజ్ తో వసూళ్లు రాబోవు రోజుల్లో భారీగా రావడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. డాలి దర్శకత్వం వచించిన ఈ చిత్రం లో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.