మరో షెడ్యూల్ కు సిద్దమవుతున్న ‘కాటమరాయుడు’ !


పవన్ కళ్యాణ్ – డాలి కాంబినషన్లో తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’ చిత్రంపై ఎంతటి భారీ అంచనాలున్నాయి వేరే చెప్పనవసరం లేదు. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకుని డాలి ఈ చిత్రాన్ని అన్ని విధాల ప్రేక్షకులకు నచ్చేలా తెరెక్కిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీ నుండి కొత్త షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లనుంది.

ఈ షెడ్యూల్ సుమారు 20 రోజులపాటు నిర్విరామంగా జరగనుంది. వైజాగ్ కు దగ్గర్లోని అనకాపల్లి వద్ద గల తంతాది బీచ్ లో ఈ షూటింగ్ కోసం ప్రత్యేకమైన ఇంటి సెట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఫ్యాక్షన్ నైపథ్యంలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ చిత్రం రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ ను కొల్లగొట్టే అవకాశముందట. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది.