రికార్డుల మోత మోగిస్తోన్న ‘కాటమరాయుడు’ టీజర్!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా గత నెలరోజులుగా ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘కాటమరాయుడు’ టీజర్ నిన్న సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. కాటమరాయుడు అనే పవర్ఫుల్ రోల్‌లో పవన్ నటిస్తోన్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి నెలాఖర్లో విడుదల కానుంది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో పరిచయం చేస్తూ వచ్చిన ఫస్ట్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ దాటగా, 130కే పైగా లైక్స్ రావడం మరో విశేషంగా చెప్పుకోవాలి.

తెలుగు సినిమాలోనే కాక, సౌతిండియన్ సినిమా పరంగా చూసినా, ఈ టీజర్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. పవన్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో తెరకెక్కుతోన్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: