‘కాటమరాయుడు’ టీజర్ మరో రికార్డు కొట్టింది!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమాపై అభిమానుల్లో ఏస్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఉగాది కానుకగా మార్చి నెలాఖర్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ గత శనివారం రోజున విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సౌతిండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ 60 గంటల్లో ఈ టీజర్ 5 మిలియన్ వ్యూస్ సాధించింది. రజనీ కాంత్ నటించిన ‘కబాలి’ టీజర్ తర్వాత కాటమరాయుడు టీజర్‌దే రికార్డుగా చెప్పుకోవచ్చు.

ఇక లైక్స్ విషయంలో కబాలిని కూడా దాటేసి 173కే లైక్స్‌ సాధించిన ఈ టీజర్ ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ రోల్‌లో కనిపిస్తోన్న ఈ సినిమా సీమ నేపథ్యంలో తెరకెక్కుతోంది. టీజర్‌తోనే పవన్ ఈ సినిమాతో అభిమానులకు ఏమేం ఇవ్వనున్నారో స్పష్టమైపోయింది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి