‘కత్తి’.. రీమేక్ అయ్యేనా? డబ్బింగ్ వచ్చేనా?

kathi
విలక్షణ దర్శకుడు మురుగదాస్, తమిళ సూపర్ స్టార్ విజయ్ కాంబినేషన్‌లో తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం.. ‘కత్తి’. రైతుల కోసం పోరాడే పవర్‍ఫుల్ పాత్రలో విజయ్ అలరించారు. ఈ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో ఇప్పుడు విడుదలవుతుందని, అప్పుడు విడుదల అవుతుందని అనడమే కానీ ఇంతవరకూ ముందుకు కదల్లేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు కత్తిని తెలుగులో రీమేక్ చేసేందుకు స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

ఇక్కడి స్టార్ హీరోలు రీమేక్‌కి సిద్ధపడడం వల్లనే ఇంతవరకూ డబ్బింగ్ ప్రస్తావన రాలేదని తెలుస్తోంది. నిజానికి ‘తుపాకి’ సినిమాతో విజయ్ మార్కెట్ కొంత పెరిగింది. ఇప్పుడు కత్తి సినిమాకు కూడా మురుగదాస్ దర్శకుడు కావడం, మురుగదాస్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉండడంతో సినిమాని డబ్బింగ్ చేసినా బాగానే నడవగలదు. తెలుగులో చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోల్లో ఎవరో ఒకరితో రీమేక్ చేస్తే.. మరింత ప్రయోజనం ఉంటుందని డబ్బింగ్ వర్క్ జరగనివ్వలేదు. మరి ఈ రీమేక్ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందా ? లేదా డబ్బింగ్ వర్షనే విడుదల అవుతుందా ? అన్నది వేచిచూడాలి.

Exit mobile version