ఈ ఏడాది చివర్లో కత్రినా పెళ్లి!

Published on Oct 29, 2021 9:52 pm IST


బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న కత్రినా కైఫ్ గత కొద్ది రోజులుగా ప్రముఖ నటుడు విక్కి కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియా లో సైతం వైరల్ గా మారాయి. అయితే ఎట్టకేలకు వీరు పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో కత్రినా కైఫ్, విక్కి కౌశల్ లు పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయం తెలియడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More