హనీమూన్‌ కోసం మాల్దీవ్స్‌ కి వెళ్లిన స్టార్ జంట !

Published on Dec 19, 2021 11:08 pm IST

పెళ్లి బంధంతో బాలీవుడ్‌ జంట కత్రినాకైఫ్‌, విక్కీ కౌశల్‌ ఒక్కటి అయ్యారు. అయితే ప్రస్తుతం ఈ జంట మాల్దీవ్స్‌ కి వెళ్ళింది. తమ హనీమూన్‌ను మాల్దీవ్స్‌లో ప్లాన్‌ చేసుకున్నారు. అయితే, ఈ విషయాన్ని కత్రినా నెటిజన్లతో పంచుకుంటూ.. ‘మెహందితో ఉన్న తన చేతులను, అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రతీరం ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. కత్రినా షేర్‌ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లవ్లీ మాల్దీవ్స్‌, లవ్లీ లైఫ్‌ అన్నట్టుగా కత్రినా పోస్ట్ చేసిన ఫొటో చెప్తోందని నెటిజన్లు కూడా ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు అయితే, ఆలస్యంగానైనా హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఫోటోలో మీ రెండు చేతులు కనిపిస్తున్నాయి. మరి ఈ ఫోటో విక్కీ తీశాడు కదా? అని ఫన్నీగా స్పందించారు. ఏది ఏమైనా ఈ ఫోటో పోస్ట్ చేసిన 20 గంటల్లోనే దాదాపు 37 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి.

సంబంధిత సమాచారం :