భీమవరం టాకీస్‌ ‘కేడి బిర్లా`కిలాడి రంగా’
Published on Jul 13, 2015 10:00 am IST

KBKR
ఇటీవలే ‘శీనుగాడి వ్‌స్టోరి’ చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకొన్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘భీమవరం టాకీస్‌’ తాజాగా మరో సూపర్‌హిట్‌ తమిళ చిత్రం తొగు అనువాద హక్కుల్ని కైవసం చేసుకొంది. ‘పసంగ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై.. ‘గోలిసోడా’ వంటి పు సెన్సేషనల్‌ హిట్స్‌ ఇచ్చి.. తమిళంలో టాప్‌ డైరెక్టర్స్‌గా ఒకరిగా మెగొందుతున్న పాండీరాజ్‌ దర్శకత్వంలో రూపొంది.. భారీ విజయం సొంతం చేసుకొన్న ‘కేడి బిర్లా`కిలాడి రంగా’ చిత్రాన్ని అదే పేరుతో తొగు ప్రేక్షకుకు అందించేందుకు సన్నాహాు చేసుకొంటున్నారు భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మపల్లి రామసత్యనారాయణ. విమల్‌, శివకార్తికేయన్‌ హీరోుగా నటించిన ఈ చిత్రంలో రెజీనా, బిందుమాధవి హీరోయిన్లు కావడం ఒక విశేషం కాగా.. ఈ చిత్రానికి యువ సంగీత సంచనం యువన్‌ శంకర్‌రాజా సంగీత దర్శకుడు కావడం మరో ముఖ్య విశేషం. ఈ సందర్భంగా భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ..‘పసంగ, మెరీనా, గోలీసోడా’ వంటి పు సెన్సేషనల్‌ హిట్స్‌ ఇచ్చిన యువ ప్రతిభాశాలి పాండీరాజ్‌ దర్శకత్వంలో రూపొంది తమిళంలో సంచన విజయం సాధించిన ‘కేడి బిర్లా`కిలాడి రంగా’ చిత్రం తొగు హక్కు కోసం చాలామంది పోటీ పడినప్పటికీ.. ఈ చిత్రం హక్కు మాకు దక్కడం చాలా గర్వంగా భావిస్తున్నాం. పు అనువాద చిత్రా ద్వారా తొగు ప్రేక్షకుకు సుపరిచితులైన విమల్‌, శివకార్తికేయన్‌ నటన, రెజీనా, బిందుమాధవి గ్లామర్‌, యువన్‌ శంకర్‌రాజా సంగీతం, పాండీరాజ్‌ దర్శకత్వ ప్రతిభ ‘కేడి బిర్లా`కిలాడి రంగా’ చిత్రానికి ప్రధాన ఆకర్షణు. త్వరలోనే డబ్బింగ్‌ కార్యక్రమాకు శ్రీకారం చుట్టబోతున్నాం’ అన్నారు. సూరి, ఢల్లీి గణేష్‌, సుజాత, సందిని తదితయి ఇతర ముఖ్యపాత్రు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: విజయ్‌, మ్యూజిక్‌: యువన్‌శంకర్‌రాజా, నిర్మాత: తుమ్మపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: పాండీరాజ్‌!!

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook