‘ఆర్ఆర్ఆర్ 2’ పై కీరవాణి స్పష్టత.. వైరల్ వీడియోలో నిజమెంత ?

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) చిత్రం సీక్వెల్ గురించి వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి, కానీ ఈ సీక్వెల్ నిజంగా ఖరారైందా ?. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ సీక్వెల్ అవకాశాల గురించి మాట్లాడుతున్న ఒక వీడియో ‘X’ (ట్విట్టర్)లో మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఇది ఆయన చేసిన తాజా ప్రకటన అని అభిమానులు భావిస్తున్నారు. అయితే, ఈ వైరల్ వీడియోలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. వాస్తవానికి ఈ వీడియో పాతది.

‘ఆర్ఆర్ఆర్ 2’ అవకాశాల గురించి కీరవాణి గతంలో మాట్లాడారు. ఆ క్లిప్ నే, ఇప్పుడు మళ్లీ బయటకు తీసి, కొందరు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇప్పటికీ అయితే, ‘ఆర్ఆర్ఆర్ 2’ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. రాజమౌళి ప్రస్తుతం తన తదుపరి చిత్రం వారణాసి పై మాత్రమే దృష్టి సారించారు; ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేసింది. అన్నట్టు జపాన్ భాషలోకి కూడా అనువదింపబడిన ఈ చిత్రం, అక్కడ కూడా అఖండ విజయాన్ని సాధించింది.

Exit mobile version