మహేష్ కి పోటీగా డైలాగ్స్ చెప్పిందట !

Published on May 2, 2022 11:50 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతుంది. అందుకే, మేకర్స్ ప్రమోషన్స్‌ ను స్పీడప్ చేశారు. కాగా ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ నుంచి తాజాగా ఒక క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ తన పాత్రకి డబ్బింగ్ పూర్తి చేసింది.

కీర్తి సురేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. పైగా దర్శకుడు పరశురామ్, తమన్ లతో తాను దిగిన ఫోటోను కూడా ఆమె పోస్ట్ చేసింది. కీర్తి సురేశ్ ఈ సినిమా కోసం అత్యంత సహజంగా తన వాయిస్‌ ను ఇచ్చిందట. కాగా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది.

తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుంచి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి ? అనే అంశాల చుట్టూ సినిమా నడుస్తోందని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :