“అరబిక్ కుతు” సాంగ్ కి స్టెప్పులేసిన కీర్తీ సురేష్… వీడియో వైరల్

Published on Mar 6, 2022 7:00 pm IST

తలపతి విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బీస్ట్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం నుండి అరబిక్ కుతు పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. యూ ట్యూబ్ లో సైతం భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. అయితే ఈ పాటకి ఇన్ స్టాగ్రం లో ఫ్యాన్స్ వీడియోస్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సినీ పరిశ్రమ కి చెందిన వారు సైతం ఈ పాటకి స్తెప్పులు వేస్తూ వీడియోస్ ను షేర్ చేస్తున్నారు. ఆ లిస్ట్ లోకి తాజాగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ చేరింది. తనదైన శైలి లో పాటకి క్యూట్ స్టెప్పులు వేస్తూ డాన్స్ చేశారు. ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :