అల్లు అర్జున్ బోయపాటి చిత్రం కోసం కీర్తి సురేష్?

Published on Nov 7, 2021 7:53 pm IST

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాను రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో లేడీ లీడ్ రోల్ కోసం కీర్తి సురేష్ ను ఎంపిక చేసే ఆలోచన లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే కీర్తి సురేష్ ను సంప్రదించి మేకర్స్ త్వరలో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన అనంతరం ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :

More