మరో క్రేజీ రీమేక్ లో కీర్తి సురేష్?

Published on Aug 30, 2021 8:32 am IST


కృతీసనన్‌ ప్రధాన పాత్రలో వచ్చిన బాలీవుడ్‌ సినిమా ‘మిమీ’. కాగా తాజాగా ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ కాబోతుంది అని తెలుస్తోంది. కృతీసనన్‌ చేసిన పాత్రను సౌత్‌లో మహానటి ఫేమ్ కీర్తి సురేశ్‌ చేయబోతుంది అని, ఇప్పటికే కీర్తి సురేష్ కూడా ఆ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

అయితే, ‘‘మిమీ’లో కృతి సనన్ తల్లిగా నటించింది. ఆ పాత్ర కోసం ఆమె బాగా బరువు పెరిగింది. ఆ భారీ తనం కృతి సనన్ లుక్ ఆ మధ్య బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ కూడా అయింది. మరి కీర్తి సురేష్ కూడా కృతి సనన్ లానే తన లుక్ ను మార్చుకుంటుందా ? చూడాలి.

ఇక సినిమా పాయింట్ కి వస్తే.. ఓ విదేశీ జంటకు బిడ్డను ఇవ్వడం కోసం సరోగసీ ద్వారా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’.

సంబంధిత సమాచారం :