శర్వానంద్ సినిమాలో తల్లి పాత్ర చేయబోతున్న కీర్తి సురేశ్?

Published on Apr 2, 2022 2:02 am IST

యంగ్ అండ్ ఫ్యామిలీ హీరో శర్వానంద్ కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ అందుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఈ హీరోకి ఒక్క హిట్టు కూడా పడడంలేదు. ఇటీవల మంచి అంచనాలతో వచ్చిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కనీసం తన తదుపరి సినిమాతోనైనా హిట్ కొట్టాలని శర్వానంద్ చూస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఈసారి దర్శకుడు కృష్ణ చైతన్యతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు శర్వానంద్. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా అని, ఇందులో శర్వానంద్‌కి ఓ బిడ్డ కూడా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా కృతిశెట్టిని తీసుకోవాలనుకున్నారని, ఆమెని సంప్రదించగా.. కెరీర్ బిగినింగ్‌లోనే తల్లి పాత్రలు చేయడం కరెక్ట్ కాదనుకొని నో చెప్పిందట. దీంతో దర్శకనిర్మాతలు కీర్తి సురేష్‌ను సంప్రదించారు. ఇదివరకు ఆమె ‘పెంగ్విన్’ సినిమాలో ఓ బిడ్డకు తల్లిగా నటించింది. ఇప్పుడు మరోసారి శర్వానంద్ సినిమాలో అలాంటి పాత్ర పోషించబోతుందని తెలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

సంబంధిత సమాచారం :