ఆ కమెడీయన్ సరసన కీర్తి సురేశ్ నటించబోతుందా?

Published on Sep 22, 2021 2:40 am IST


మహానటి సినిమా తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి సురేశ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే తమిళ స్టార్ కమెడీయన్ వడివేలు ‘నాయి శేఖర్ రిటర్న్స్’ అనే చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ కమెడీయన్ సరసన నటించడానికి కీర్తి సురేశ్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు స్టార్ హీరో సినిమాలు, ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లోనే నటించిన కీర్తి సురేష్ ఇప్పడు కమెడీయన్ సరసన నటించేందుకు సిద్దమవ్వడం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది.

అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోందని, సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని, అందుకే ఇలాంటి పాత్ర చేయడానికి కీర్తి సురేష్ కూడా ఒప్పుకుందని టాక్. అయితే ఈమె వడివేలు సరసన హీరోయిన్‌గా కనిపిస్తారా లేక సినిమాలో కీలకపాత్ర పోషిస్తారా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :