కళావతి సాంగ్ కి స్టెప్పులేసిన కీర్తి సురేష్…వీడియో వైరల్!

Published on Feb 21, 2022 3:00 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో మహానటి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన తొలిసారిగా నటిస్తుండటం తో ఈ జంట పై టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఇటీవల ఈ చిత్రం నుండి విడుదల అయిన కళావతి సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన పాటకు తానే స్టెప్పులు వేసింది కీర్తి సురేష్. అందుకు సంబంధించిన ఒక వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. కీర్తి సురేష్ డాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం మే 12, 2022 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :