ఆకట్టుకుంటున్న కీర్తి సురేశ్ “గాంధారి” డ్యాన్స్..!

Published on Feb 21, 2022 10:08 pm IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఓ పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే.. తొలిసారి ఓ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లో నటించి “గాంధారి”గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కీర్తి సురేశ్. ది రూట్, సోని మ్యూజిక్ సౌత్ సంయుక్తంగా నిర్మించిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ తాజాగా విడుదలయ్యింది.

“గాంధారీ గాంధారీ.. నీ మరిది గాంధారీ.. దొంగ చందమామలాగా వంగి చూసిండే” అంటూ నృత్య ప్రధానంగా సాగే ఈ పాటలో కీర్తి సురేశ్ సాంప్రదాయ దుస్తుల్లో చేసిన డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. సుద్దాల ఆశోక్ తేజ ఈ పాటకు సాహిత్యం అందించగా, అనన్య భట్ ఆలపించారు. “లవ్ స్టోరీ” ఫేం పవన్ సీహెచ్ సంగీతం అందించగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా దర్శకత్వం వహించింది. మరీ అందరినీ ఆకట్టుకుంటున్న “గాంధారీ”పై మీరు ఓ లుక్ వేయండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :