సెట్స్ లో సావిత్రిని గుర్తుచేసిన కీర్తి సురేష్ !

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహానటి’ చివరి దశ షూటింగ్లో ఉంది. అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇకపోతే తాజాగా సెట్స్ లో కీర్తి సురేష్ టీమ్ సభ్యులందరికీ బంగారు కాయిన్స్ బహుకరించిందట.

సావిత్రి కూడా అప్పట్లో సినిమా సెట్స్ లో మెంబర్స్ అందరికీ ఇలాగే గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవారని, కీర్తి సురేష్ ఆమె పాత్రలో నటించడం మాత్రమే కాక నిజ జీవితంలో ఆమెను గుర్తుచేశారని క్రూ మొత్తం అనుకుంటున్నారట. దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, సమంత వంటి స్టార్ నటీ నటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేయనున్నారు.