‘సూర్య’ పక్కన ఛాన్స్ కొట్టేసిన ‘రామ్’ హీరోయిన్ !

3rd, August 2016 - 01:54:27 PM

keeti-suresh
తెలుగులో హీరో రామ్ తో కలిసి ‘నేను శైలజ’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అందాల భామ ‘కీర్తి సురేష్’. తెలుగులో మొదటి చిత్రం తరువాత మారె సినిమాకీ ఒప్పుకోని ఈమె తమిళంలో మాత్రం వరుస సినిమాలతో దుమ్ములేపుతోంది. ఇప్పటికే హీరో ధనుష్ తో చేసిన సినిమా ఈ ఆగష్టులోనే విడుదల కానుండగా ‘ఇళయదళపతి విజయ్’60వ చిత్రంలో సైతం నటిస్తోంది.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కీర్తి సురేష్ మరో క్రేజీ అఫర్ కొట్టేసింది. తమిళ స్టార్ హీరో ‘సూర్య’ త్వరలో చేయబోయే సినిమా కోసం ఈమెను సంప్రదించినట్టు, అందుకు ఈమె కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ‘ముత్తయ్య’ తెరకెక్కించనున్నారు.