“ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధులుగా ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు..!

Published on Feb 24, 2022 10:00 pm IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదల కాబోతుంది.

అయితే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హీరోయిన్లు కీర్తి సురేష్, సాయి పల్లవి హాజర్ కానున్నట్టు మేకర్స్ తెలిపారు. సినిమా థీమ్‌కి తగ్గట్టుగానే ఇద్దరు నటీమణులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించడం విశేషమని చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చగా, సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందించారు.

సంబంధిత సమాచారం :