“సర్కారు వారి పాట”కి తన లాస్ట్ వర్క్ స్టార్ట్ చేసిన కీర్తి.?

Published on Apr 19, 2022 10:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. నిన్న ఈ సినిమాలో ప్లాన్ చేసినటువంటి క్రేజీ మాస్ సాంగ్ షూట్ కంప్లీట్ చెయ్యడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిపోయింది.

ఇక ఆల్ మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకి గాను కీర్తి సురేష్ కూడా తన ఫైనల్ వర్క్ గా డబ్బింగ్ ని స్టార్ట్ చేసేసినట్టు తెలుస్తుంది. అలాగే దీనిని కూడా ఈ కొన్ని రోజుల్లోనే ఈమె ఫినిష్ చేసేయనుండగా మేకర్స్ అనుకున్న సమయానికే మొత్తం అన్ని పనులు ప్లానింగ్ ప్రకారం చేసేసి అనుకున్న సమయానికి గాను రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారట. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :