నాగ్ అశ్విన్ కి థాంక్స్ తెలిపిన కీర్తి సురేష్!

నాగ్ అశ్విన్ కి థాంక్స్ తెలిపిన కీర్తి సురేష్!

Published on Jul 2, 2024 11:06 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఎడి జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతున్న ఈ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పై ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ చిత్రంలో బుజ్జి రోల్ కి వాయిస్ ఓవర్ అందించిన కీర్తి సురేష్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపించిన ఒక అభిమానికి థాంక్స్ తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ ను షేర్ చేశారు. అంతేకాక ఈ అవకాశం ఇచ్చిన నాగ్ అశ్విన్ కి థాంక్స్ తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు