ఆయన మార్క్‌ అద్భుతంగా అనిపిస్తోంది – కీర్తి సురేశ్‌

Published on Feb 28, 2022 8:03 am IST

హీరో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా “ఆడవాళ్లు మీకు జోహార్లు”. కుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 4వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు కీర్తి సురేశ్‌, సాయి పల్లవి ముఖ్య అతిథిలుగా వచ్చారు.

కాగా ఈ సందర్భంగా కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ.. “కిశోర్‌ దర్శకత్వంలోనే నా ఫస్ట్ సినిమా నేను శైలజ వచ్చింది. కిషోర్ తిరుమల గారు రాసే కథలు, వేసే పంచ్‌ లు చాలా బాగుంటాయి. ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. ఆయన చేసిన సినిమాలో టైటిల్‌ క్రెడిట్స్‌ లో ఆయన పేరు లేకపోయినా.. ఈ సినిమా కిశోర్‌ తిరుమలది అని చెప్పొచ్చు. అంతలా తనదైన మార్క్‌ ను చూపిస్తారు కిషోర్ తిరుమల’ అని చెప్పుకొచ్చింది కీర్తి సురేశ్‌.

సంబంధిత సమాచారం :