8 రోజుల్లో అదరగొట్టిన “కేరళ 2018” తెలుగు వసూళ్లు.!

Published on Jun 3, 2023 10:00 am IST

రీసెంట్ మాలీవూడ్ సెన్సేషనల్ హిట్ చిత్రం “కేరళ 2018” అక్కడ రికార్డు వసూళ్లతో అయితే ఈ చిత్రం అదరగొట్టగా ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ చేయగా ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ ని డే నుంచే స్టార్ట్ చేసి మొదటి వారం రన్ ని కంప్లీట్ చేసుకుంది. మరి ఈ సినిమా తెలుగులో మొత్తం 8 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ 8 రోజుల్లో అయితే మొత్తం 8.21 కోట్ల భారీ గ్రాస్ ని అయితే అందుకొని తెలుగులో అయితే మంచి లాభాలు ఇచ్చిన మరో చిత్రంగా నిలిచింది.

ఈ వారాంతంలో కూడా సాలిడ్ వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అవుతుండగా ఈ రెండు రోజుల్లో ఈ చిత్రం 10 కోట్ల మార్క్ ని చేరుకున్నా ఆశ్చర్యం లేదని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ ఎమోషనల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుందనే చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని జూడే ఆంథోని దర్శకత్వం వహించగా టొవినో థామస్, అపర్ణ బాలమురళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం :