“ది కేరళ స్టోరీ” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

Published on May 19, 2023 5:00 pm IST


దేశ వ్యాప్తంగా ది కేరళ స్టోరీ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. చిన్న సినిమాగా థియేటర్ల లోకి వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ చిత్రం నిన్న మరో 7 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఇప్పటి వరకూ 171.7 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా ఇలాంటి వసూళ్లు రాబట్టడం సెన్సేషన్ అని చెప్పాలి

త్వరలో ఈ చిత్రం 200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. అదా శర్మ, సిద్ది ఇడ్నాని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుదిప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్ళను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :