ఓటిటి రిలీజ్ విషయంలో కేరళ థియేటర్ ఓనర్స్ డిమాండ్.?

Published on Jun 7, 2023 10:00 pm IST

లేటెస్ట్ గా కేరళ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచిన లేటెస్ట్ సినిమా “2018” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యి అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఇప్పటికీ థియేటర్స్ లో అదిరే వసూళ్లు రాబడుతూ ఉండగా తెలుగులో కూడా ఈ చిత్రం రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఊహించని విధంగా చాలా త్వరగానే ఓటిటి లో వచ్చేయడంతో అక్కడి థియేటర్ ఓనర్స్ అయితే నిరసన వ్యక్తం చేశారు.

మరి ఓటిటి వారికి అయితే సినిమాల రిలీజ్ విషయంలో లేటెస్ట్ డిమాండ్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక నుంచి కేరళలో అయితే సినిమాలు రిలీజ్ అయ్యిన 48 నుంచి 90 రోజుల మధ్యలోనే ఓటిటి లో రిలీజ్ చేసుకోవాలని డిమాండ్ చేసున్నారట. అంతే కాకుండా తమ డిమాండ్ అయితే గవర్నమెంట్ తరపు నుంచి ఇంప్లిమెంట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఇది లాస్ట్ కి ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :