రెండవ రోజు కూడా కలెక్షన్లలో దుమ్ము రేపిన ‘కేశవ’ !


వరుస విజయాలతో మంచి జోరుమీదున్న యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ చేసిన మరో భిన్నమైన ప్రయత్నం ‘కేశవ’ శుక్రవారం విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఫస్ట్ డే రూ. 4.6 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు కూడా అదే హవా చూపించింది. చిత్ర పిఆర్ టీమ్ సమాచారం ప్రకారం రెండవ రోజు రూ. 3. 70 కోట్ల గ్రాస్ ను రాబట్టిందట ఈ చిత్రం.

ఏరియాల వారీగా చూసుకుంటే నైజాంలో రూ. 1.05 కోట్లు, ఆంధ్రాలో రూ. 1.35 కోట్లు, సీడెడ్లో రూ.40 లక్షలు, ఓవర్సీస్లో రూ. 50 లక్షలు, ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో రూ.40 లక్షలు వసూలు చేసి మొత్తం రెండు రోజులకు కలిపి రూ. 8.3 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. పైగా ఈరోజు ఆదివారం కావడంతో ఈ వసూళ్లు ఇంకాస్త మెరుగ్గా ఉండే అవకాశముంది.