మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కేశవ’ !


యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన తాజా చిత్రం ‘కేశవ’. ట్రైలర్లతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా నిన్న శుక్రవారం గ్రాండ్ గా విడుదలైంది. వైవిధ్యమైన నిఖిల్ కథా ఎంపిక, సుధీర్ వర్మ స్టైలిష్ మేకింగ్ కారణంగా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ చిత్రం సుమారు రూ. 63 లక్షల షేర్ వసూలు చేసింది.

మొత్తం విడుదలైన అన్ని ప్రాంతాల్ని కలుపుకుంటే ఈ చిత్రం సుమారు రూ. 4.6 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఈ ఓపెనింగ్స్ నిఖిల్ కెరీర్లోనే ఉత్తమమైనవిగా చెప్పుకోవచ్చు. కొత్తగా ఉన్న కథ, నిఖిల్ నటన, కథనానికి సుధీర్ వర్మ ఇచ్చిన డిఫరెంట్ ట్రీట్మెంట్ సినిమాకి మంచి పాజిటివ్ మౌత్ టాక్ చేశాయి.