‘కేశవ’ మూడు రోజుల కలెక్షన్ల వివరాలు !


యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ చేసిన తాజా చిత్రం ‘కేశవ’ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే రూ. 4. 6 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రెండవ రోజైన శనివారం కూడా అదే జోరు కొనసాగించి రూ. 3.7 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ బాక్సాఫీస్ విషయానికొస్తే గురువారామ్ నాడు ప్రివ్యూలు ద్వారా $55,507, శుక్రవారం నాడు $53,196, శనివారం $60,226 వసూలు చేసి మొత్తంగా రూ. 1. 09 కోట్లు అందుకుంది.

అలాగే మూడవ రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు అలాగే స్టడీగా కొనసాగాయి. దీంతో మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 11.40 కోట్ల గ్రాస్ వసూలైనట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. హీరో నిఖిల్ కెరీర్లో కూడా ఇవే బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ కకావడం విశేషం. ఇలా చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించడంతో హీరో నిఖిల్ తో పాటు నిర్మాతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.