లేటెస్ట్..”RRR” హిందీ రిలీజ్ లో మార్పు.?

Published on Mar 4, 2022 8:24 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం మళ్ళీ బుకింగ్స్ ఓపెన్ చేసుకొని బాక్సాఫీస్ దుమ్ము లేపడానికి సిద్ధంగా ఉంది.

అయితే ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి బిజినెస్ ని జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి భాషలో కూడా ఓ ప్రముఖ బ్యానర్ వారు ఈ సినిమా హక్కులు రికార్డు మొత్తంలో సొంతం చేసుకొని విడుదలకి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అలా హిందీలో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ వారు సొంతం చేసుకున్నారు.

కానీ ఇప్పుడు హిందీ రిలీజ్ కి సంబంధించి కీలక మార్పు చోటు చేసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రాన్ని “RRR” మేకర్స్ నే హిందీలో సొంతంగా ఇప్పుడు విడుదల చేసుకోబోతున్నారట. మరి లాస్ట్ లో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :