రాజమౌళి, పవన్ ల భేటీ రెండిట్లో దేనికోసమో అని..?

Published on Nov 23, 2021 10:01 am IST


ప్రస్తుతం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా పలు భారీ సినిమాలు మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ రేస్ లో దర్శకుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు తో చేసిన ఇండియా బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ సినిమా “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. భారీ స్థాయి అంచనాలుతో ఈ సినిమానే మొదట సంక్రాంతి రేస్ ని మొదలు పెట్టనుంది.

ఇక ఇదిలా ఉండగా ఇదే సంక్రాంతి బరిలో వెనక్కి తగ్గేది లేదంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన మాస్ సినిమా “భీమ్లా నాయక్” కూడా రెడీ అయ్యిపోయింది. ఎప్పటికప్పుడు నిర్మాత నాగవంశీ క్లారిటీ ఈ సినిమా జనవరి 12నే వస్తున్నట్టుగా క్లారిటీ ఇస్తుండడంతో ఈ సంక్రాంతి మరింత హీటెక్కింది. అయితే ఇదే క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి పవన్ ని కలవనున్నారని ఓ టాక్ అయితే వైరల్ అవుతుంది.

మరి దీనిపై రెండు అంశాలు కీలకంగా వినిపిస్తున్నాయి. వాటిలో మొదటగా భీమ్లా నాయక్ వాయిదా కోసం అని అలాగే ఇంకొకటి తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పిలవడానికి కూడా అయ్యి ఉండొచ్చని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ వీటిలో ఏది నిజం అనేది ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. సో దీనిపై అందాకా హడావుడి లేకుండా ఉంటేనే బెటర్.

సంబంధిత సమాచారం :