“గేమ్ ఛేంజర్” షూట్..వీరిపై కీలక సన్నివేశాలు.!

game

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే రీసెంట్ గానే సరికొత్త యాక్షన్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసుకోగా శంకర్ సారథ్యంలో ఈ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా అయితే దూసుకెళ్తుంది.

ఇక ఇపుడు ఓరోజు బ్రేక్ తో అయితే మళ్ళీ ఈ 16 నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేసుకోనుండగా ఇందులో హీరో చరణ్ సహా వెర్సటైల్ సీనియర్ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య పై శంకర్ పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాలో సూర్య అయితే విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పొలిటికల్ డ్రామాలో శంకర్ ప్రెజెంటేషన్ కోసం అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version