ఆంధ్రాలో ఏరియాల వారీగా “కేజీయఫ్ 2” డే 1 వసూళ్ళ వివరాలు ఇవే.!

Published on Apr 15, 2022 2:00 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ యాక్షన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు లో కూడా మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యింది.

అయితే చాప్టర్ 1 ముందు మంచి రెస్పాన్స్ అందుకోగా దీనిపై కూడా మంచి బజ్ నెలకొనేసరికి ఇక్కడ కూడా మంచి వసూళ్లనే ఈ చిత్రం అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటికి తగ్గట్టుగా నే ఇప్పుడు ఆంధ్రా లో ఈ సినిమా ఎంత వసూళ్ళ మొదటి రోజు రాబట్టిందో తెలుస్తోంది. ఇక ఏరియాల వారీగా ఈ వసూళ్లు చూసినట్టు అయితే..

వైజాగ్ – 1.75 కోట్లు
ఈస్ట్ గోదావరి – 1.2 కోట్లు
వెస్ట్ గోదావరి – 85 లక్షలు
కృష్ణ – 91 లక్షలు
గుంటూరు – 1.5 కోట్లు
నెల్లూరు – 50 లక్షలు

మొత్తం – 6.08 కోట్ల షేర్ ని ఒక్క ఆంధ్రా నుంచి కేజీయఫ్ 2 సినిమా అందుకుంది.

ఇది ఒక మంచి నెంబర్ అని చెప్పాలి. ఇక ఈ వారాంతం కూడా ఉండడం బిగ్ ప్లస్ అని చెప్పాలి. మరి ఈ రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :