కెజిఎఫ్ కాంట్రవర్సీ : క్షమాపణలు చెప్పిన ఆ ఇద్దరు డైరెక్టర్స్

Published on Mar 7, 2023 2:01 am IST


నిన్న జరిగిన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో భాగంగా కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమాపై కేర్ ఆఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియా లో భారీ దుమారం చెలరేగుతోంది. ముఖ్యంగా పలువురు ప్రేక్షకాభిమానులు వెంకటేష్ మహా పై విమర్శలు చేస్తుండడంతో పాటు ఆయన పై నెగటివ్ ట్రెండ్స్ కూడా చేస్తున్నారు. ఇక వారి ఇంటర్వ్యూ లో పాల్గొన్న లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి, యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇద్దరూ కూడా కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా ఆడియన్స్ కి క్షమాపణలు చెప్పారు. ఎందరో కష్టించి పనిచేసిన కమర్షియల్ సినిమాలకు ప్రేక్షకుల నుండి గొప్ప ఆదరణ లభించడం ఆనందం.

అయితే నిన్నటి ఇంటర్వ్యూ లో వెంకటేష్ మహా మాట్లాడిన విధానానికి తనకు నవ్వొచ్చిందేతప్ప ఎవరినీ, ఏ సినిమాని కించపరచలేనిది తన ఉద్దేశ్యం కాదని, తన వలన ఎవరైనా ఇబ్బంది పడి ఉంటె క్షమించాలని నందిని రెడ్డి కోరారు. ఏదైనా చర్చ జరుగుతుంటే అందులో భాగంగా మనం రియాక్ట్ అవుతూ ఉంటాము. అంతే తప్ప దానివలన ఎవరినీ నొప్పించాలని కాదు, ఎందరో కష్టించి పనిచేసిన ఏ సినిమా అయినా పెద్ద విజయం సాధిస్తే అందరికీ ఆనందమే అన్నారు. ఆ చర్చలో తన వలన ఏదైనా తప్పు దొర్లి ఉంటె, అలానే ఎవరినైనా నొప్పించి ఉంటె తనను మన్నించాలని వివేక్ ఆత్రేయ ఒక ప్రకటన ద్వారా కోరారు. అయితే ఈ కన్వర్జేషన్ లో ప్రధానంగా మాట్లాడిన వెంకటేష్ మహా దీనిపై ఏవిధముగా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :